+91 99635 77856

గంజాయి బానిసలైన ఐదుగురికి పోలీసుల కౌన్సిలింగ్, కఠిన హెచ్చరికలు

హుజురాబాద్/మే13(మా అక్షరం): గంజాయి మత్తుకు బానిసలైన ఐదుగురు యువకులను హుజురాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు.స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో గంజాయి వినియోగం, అమ్మకం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గొడిశాల సురేష్ (35)తుమ్మనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి భద్రాచలం ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి ఇతరులకు విక్రయిస్తున్నాడని గుర్తించారు.పోలీసుల విచారణలో గంజాయి సేవిస్తున్నవారిగా తుమ్మనపల్లి గ్రామానికి చెందిన గోపగాని నితిన్ (24), బోర్నపల్లి గ్రామానికి చెందిన మర్రిపల్లి అనిల్ (25), సింగపురం గ్రామానికి చెందిన అలకపల్లి రాకేష్ (20), అమ్మనగుర్తి గ్రామానికి చెందిన లంక దాసరి రాజ్ కుమార్ (27) పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఈ యువకులు మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వారు కావడంతో, వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జి మాట్లాడుతూ….మత్తుపదార్థాల వినియోగం, అమ్మకం చట్టరీత్యా తీవ్ర నేరమని, ఇకపై ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

NDPS చట్టం ప్రకారం శిక్షలు ఇలా ఉన్నాయి:

తక్కువ పరిమాణం (100 గ్రాముల లోపు): 6 నెలల జైలు లేదా రూ.10,000 జరిమానా

మధ్య పరిమాణం (100 గ్రాములు – 1 కిలో): 10 సంవత్సరాల జైలు లేదా రూ.1 లక్ష జరిమానా

పెద్ద పరిమాణం (1 కిలో – 20 కిలోలు): 10–20 సంవత్సరాల జైలు, రూ.1–2 లక్షల జరిమానా

వాణిజ్య పరిమాణం (20 కిలోల కంటే ఎక్కువ): అదే శిక్షల వర్తింపు….
హుజురాబాద్ డివిజన్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ప్రదేశాలను గుర్తించి, నిరంతర నిఘా పెట్టబడుతోందని, దాదాపు 75 “ఆంటీ డ్రగ్స్ కమిటీల”ను ఏర్పాటు చేశామని ఏసీపీ తెలిపారు. మత్తుపదార్థాల వినియోగం కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూరిన్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా గంజాయి, డ్రగ్స్ సేవించిన వ్యక్తులను గుర్తించవచ్చని వివరించారు.ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన హుజురాబాద్ సీఐ కరుణాకర్, ఎస్ఐ నరేందర్ రెడ్డిలను ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !