హుజురాబాద్/ మే 17 (మా అక్షరం):ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ పిల్లల సతీష్ కుమార్ ఇటీవల కాలుకు సర్జరీ చేయించుకున్న విషయం మీడియా మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ శనివారం ఆయన నివాసానికి వెళ్లారు.సతీష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.జరిగిన సర్జరీ వివరాలను అడిగి తెలుసుకొని,ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రణవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
Post Views: 384











