+91 99635 77856

రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో భూమిని కాపాడు ఆరోగ్యాన్ని సంరక్షించు

ఎల్కతుర్తి/ మే 28( మా అక్షరం):మండలంలోని జగన్నాధపూర్ గ్రామంలో బిసిఐ ఉత్తమ పత్తి యాజమాన్య పథకం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రపంచ వన్యప్రాణి సం రక్షణ నిధి సహకారంతో నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీఐ మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ వంగ రఘు మాట్లాడు తూ…. డబ్ల్యూహెచ్ ఓ జిహెచ్ఎస్ లో నిషేధిత అత్యంత విషపూరితమైన, పురుగుమందు లు మనుషుల ఆరోగ్యానికి పర్యావరణానికి అత్యధిక హాని కలిగిస్తాయని, మనుషుల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో క్యాన్సర్ కారక జన్యుపరమైన హార్మోనుల్ల పైన ప్రభావం కలిగిస్తాయని భావితరాల పిల్లలలో కూడా శారీరక మానసిక వైకల్యాన్ని కలిగిస్తాయ ని రైతులు అర్ధం చేసుకొని వాటిని పూర్తిగా మానివేయాలని చెప్పడం జరిగింది. పర్యా వరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపి పక్షులు జలచరాలు మరియు జంతు వులకు ముప్పు వాటిల్లుతుందని రైతులకు తెలపడం జరిగింది.
అక్కిపల్లి మౌనిక మాట్లాడుతూ… పంట అవశేషాలను కాల్చడం వలన గ్రీన్ హౌస్ గ్యాస్ లు(కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ) గాలిలో కలిసిపోయి వాతావరణ మార్పులు ఏర్పడతాయని ఫలితంగా అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని. ఆ ప్రదేశంలోని మేలుచేసే సూక్ష్మ జీవులకి ప్రమాదం ఏర్పడుతుందని కావున పంట అవశేషాలు నేలలోకలియ దున్నడం వలన భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుం ది. నేలలో పోషకాలు స్థాయి పెరగడం వల్ల కొంత వరకు భూమిలో రసాయన ఎరువుల ను తగ్గించుకోవచ్చు రైతులు పెట్టుబడి తగ్గిం చుకొని దిగుబడి పెంచుకోవడంతో పాటు వాతావరణ మార్పులును అరికట్టవచ్చని తెలుపారు. అనంతరం గ్రామ రైతులతో కలిసి ర్యాలీ చేస్తూ రైతన్న మేలుకోఆరో గ్యాన్ని కాపాడుకో రసాయనాలు వద్దు సేంద్రియలు ముద్దు అంటూ నినాదాలు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిఐ సిబ్బంది, మోహన్, రాజేందర్,లత,రమేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !