+91 99635 77856

డిసిపి బెదరకోట జనార్దన్ సేవలు అందరికి ఆదర్శం

-ఉద్యోగ విరమణ చేసిన బెదరకోట సన్మాన సభలో వక్తలు …
-మచ్చలేని అధికారికి వెల్లువెత్తిన అభిమానం …
-డిసిపి బెదరకోట జనార్దన్ కు ఘనంగా సన్మానం …
-హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ జెడ్పి చైర్మన్ డా. ఎం సుధీర్ కుమార్…
హనుమకొండ/జూన్ 01(మా అక్షరం): పోలీసు అధికారిగా బెదరకోట జనార్దన్ చేసిన సేవలు మరువలేనివని, అయన అందరికి ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు. వరంగల్ క్రైమ్ డిజిపిగా ఉద్యోగ విరమణ చేసిన బెదరకోట జనార్దన్ సన్మాన సభ శనివారం రాత్రి హనుమకొండ చింతగట్టులోని కె ఎల్ ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి పలు జిల్లాల నుండి పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, హుజురాబాద్, సైదాపూర్ ల నుండి అయన బాల్య మిత్రులు, బంధువులు, అభిమానులు హాజరయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన జనార్దన్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత పోలీసు అధికారి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డా. ఎం సుధీర్ కుమార్ లతో పాటు 1989 బ్యాచ్ పోలీసు అధికారులు, వరంగల్, కరీంనగర్ పూర్వ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. జనార్దన్ 1989 లో పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లో చేరి సి ఐ గా ఎసిపిగా పనిచేసి డిసిపి గా ఉద్యోగ విరమణ చేసారని, 36 ఏళ్ల పాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి మంచి అధికారిగా, మచ్చలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని, ఆయా హోదాలకు వన్నె తెచ్చారని ప్రశంసించారు. అయన వరంగల్లో ఉద్యోగంలో చేరి ఇక్కడే ఉద్యోగ విరమణ చేయడం, అన్ని వర్గాలతో మంచి సంబంధాలు కలిగి ఉండి, అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారని ప్రశంసించారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉన్నారని, అయన ఎక్కడా పోలీసు అధికారి అన్న భావన రాకుండా.. సామాన్య సిబ్బందితో సైతం మమేకమై పనిచేశారని, తనవద్దకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసారని అన్నారు. అయన మూడేళ్లపాటు విద్యుత్ శాఖలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారని, ఎన్నో సమస్యలు పరిష్కరించారని, మానవతా దృక్పధంతో పనిచేసి సామాన్య విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేసారని ప్రశంసించారు. హుజురాబాద్, సైదాపూర్, హనుమకొండ ప్రాంతాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, మిత్రులు, అభిమానులు జనార్దన్ ను పుష్ప గుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మాన పత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఎసిపి కొత్త దేవేందర్ రెడ్డి, కాజీపేట ఎసిపి పింగిళి ప్రశాంత్ రెడ్డి, విజిలెన్స్ ఎస్పీ రంగరాజు భాస్కర్, విశ్రాంత అధికారులు మహేష్, సంజీవ రావు, తాళ్లపల్లి సుదర్శన్ గౌడ్, రామ్ నర్సింహా రెడ్డి, దామెర నర్సయ్య, విద్యుత్ శాఖ ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, హుజురాబాద్ నుండి ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, చొల్లేటి కిషన్ రెడ్డి, వడ్లూరి విజయ్ కుమార్, కొలిపాక శ్రీనివాస్, కొండపాక శ్రీనివాస్, ఆడెపు సూర్యం, వంగల హన్మంతు గౌడ్, రాజేందర్, సొల్లు దశరథం, పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకార్ వెంకటేష్, హుజురాబాద్ పూర్వ విద్యార్థులు శివ రతన్ సింగ్, అజేంద్ర కుమార్ రాథోడ్, ఆలేటి రవీందర్, విడపు రాజు, గోలి శ్రీనివాస్, పవన్, గౌరిశెట్టి సోమేశ్వర్, మల్లేశం, అనుమాండ్ల ప్రసాద రెడ్డి, చందుపట్ల రామ్మూర్తి, మంచికట్ల మహేందర్, ప్రసాద్, చీకట్ల సమ్మయ్య, ఖైరున్నీసా బేగం, పాత్రికేయులు చాడ వెంకట్ రెడ్డి, ఎన్ బుచ్చిరెడ్డి, గడ్డం రాజిరెడ్డి, సైదాపూర్ నుండి కొత్త అశోక్ రెడ్డి, కూతురు విద్వాన్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, వేముగంటి భాస్కర్ రావు, కొండా గణేష్, తొంట ఓదెలు, అనగోని వీరన్న గౌడ్, ముత్యాల వీరా రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !