హుజూరాబాద్/జూన్ 02 (మా అక్షరం):తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు నేతృత్వంలో అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చాలు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రం కోట్లాది ప్రజల కల,అమరవీరుల త్యాగఫలం అని ఇది ఎందరో పోరాటాల ఫలితంగా సాధ్యమైంది.కార్మికులు, రైతులు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువత, మహిళలు, మేధావులు, కళాకారులు, రచయితలు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల పాత్ర లేకుండా ఈ తెలంగాణ సాధ్యం కాలేదు,అని అన్నారు.తెలంగాణ సాధనలో భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని, ముఖ్యంగా స్వర్గీయ సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో తెలుగులో విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు వద్దు, తెలంగాణ చూడడం కోసం బతకాలని అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆమెను ‘తెలంగాణ చిన్నమ్మ’గా ప్రజలు గౌరవించారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినవారి త్యాగాలకు నిజమైన గౌరవం ఇవ్వాలంటే, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నేడు తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “తెలంగాణ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే రాష్ట్రం మళ్లీ ప్రజల చేతిలోకి రావాలి,” అని తూర్పాటి రాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, నాయకులు కొలిపాక శ్రీనివాస్, బొరగల సారయ్య, యల్ల సంజీవరెడ్డి, సబ్బని రమేష్, తిప్పబతినీ రాజు, కొలిపాక వెంకటేష్, కొడిమ్యల పవన్, భాస్కర్ యాదవ్, మాడ సందీప్, పోతుల సంజీవ్, పల్లె వీరయ్య, వేముల హృతిక్, ఆవుల సదయ్య, తాళ్లపల్లి దేవేంద్ర, గుడిపాటి కొండల్ రెడ్డి, కాపర్తి అనిల్, రాజూరి సాయితేజ, గుల్ల అనిల్, మధిర రమేష్, రాపాక రాజు, అనిశెట్టి సాంబశివ, ముశం వెంకటేశ్వర్లు, డోరీ ఐలయ్య, వోడ్నాల విజయ్, నాలుగూరి అపర్ణ, మొలుగూరి నాగేష్, తాళ్లపల్లి హరీష్, గంధం అనిల్ తదితరులు పాల్గొన్నారు.











