+91 99635 77856

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2K రన్

Kudikala Sai Editor
maaksharamnews.in

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2K రన్

హుజూరాబాద్ /జూన్ 02(మా అక్షరం): పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం పట్టణాన్ని నివాసయోగ్యమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికలో భాగంగా, హుజూరాబాద్ వాకర్స్ అసోసియేషన్, పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు.ఉదయం 5:30 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభమైన ఈ 2K రన్ కార్యక్రమం సాయిరూపా ఫంక్షన్ హాల్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన గల బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ... పట్టణ ప్రజలంతా కలిసికట్టుగా పని చేసి హుజూరాబాద్‌ను స్వచ్చ నగరంగా తీర్చిదిద్దాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 2K రన్‌లో విజేతలైన వారికి ప్రథమ బహుమతిగా రూ. 1,500/-లు, ద్వితీయ బహుమతిగా రూ. 1,000/-లు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తర్వాత, పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఉదయం 8:30 గంటలకు కమిషనర్ జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. పారిశుద్ధ్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి, అమరవీరులకు నివాళులు అర్పించారు. స్థానిక 15వ వార్డు పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించి, జంగిల్ క్లియరెన్స్ చేపట్టినారు.ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ సీఐ కరుణాకర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, పురపాలక సంఘ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, సీనియర్ సహాయకులు జె. శ్రీకాంత్, ఎండి. రషీద్, వార్డు అధికారులు, మెప్మా RPలు, మహిళా సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్ /జూన్ 02(మా అక్షరం): పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం పట్టణాన్ని నివాసయోగ్యమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికలో భాగంగా, హుజూరాబాద్ వాకర్స్ అసోసియేషన్, పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు.ఉదయం 5:30 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో ప్రారంభమైన ఈ 2K రన్ కార్యక్రమం సాయిరూపా ఫంక్షన్ హాల్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన గల బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ముగిసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ… పట్టణ ప్రజలంతా కలిసికట్టుగా పని చేసి హుజూరాబాద్‌ను స్వచ్చ నగరంగా తీర్చిదిద్దాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 2K రన్‌లో విజేతలైన వారికి ప్రథమ బహుమతిగా రూ. 1,500/-లు, ద్వితీయ బహుమతిగా రూ. 1,000/-లు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తర్వాత, పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఉదయం 8:30 గంటలకు కమిషనర్ జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. పారిశుద్ధ్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి, అమరవీరులకు నివాళులు అర్పించారు. స్థానిక 15వ వార్డు పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించి, జంగిల్ క్లియరెన్స్ చేపట్టినారు.ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ సీఐ కరుణాకర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, పురపాలక సంఘ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, సీనియర్ సహాయకులు జె. శ్రీకాంత్, ఎండి. రషీద్, వార్డు అధికారులు, మెప్మా RPలు, మహిళా సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !