+91 99635 77856

దళితుడిపై దాడి చేసిన ఎస్సై భార్గవ్ పై చర్యలు తీసుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

దళితుడిపై దాడి చేసిన ఎస్సై భార్గవ్ పై చర్యలు తీసుకోవాలి

-టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్...
హుజూరాబాద్/జూన్03(మా అక్షరం): సైదాపూర్ ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ దళిత యువకుడిని అమానుషంగా చితకబాదిన ఘటనపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ తీవ్రంగా ఖండించారు.

మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ.... బాధితుడు మహేందర్‌ను భార్గవ్ కొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపించే వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఎస్సైగా వ్యవహరిస్తున్న భార్గవ్ ఒక నియంతలా, సైకోలా ప్రవర్తించాడు. అతని చేతుల్లో దళిత యువకుడు నిర్భందితుడై బూతులు వినిపించుకుంటూ, కొట్టించుకుంటూ బాధపడుతున్నాడు. ఇలాంటి ప్రవర్తన పోలీస్ వ్యవస్థపై మచ్చ వేస్తుంది,అని విమర్శించారు.ఇప్పటికే అనేక సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఎస్సై భార్గవ్‌పై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. అలాగే,ఈ దాడిలో పాల్గొన్న కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవికుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలి, అని డిమాండ్ చేశారు.పోలీసులపై గౌరవంతోనే ఇప్పటి వరకు దళితులు పెద్దఎత్తున ఉద్యమాల్లో పాల్గొనలేదని, అయితే ఇకపై మౌనం వీడాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

-టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్…
హుజూరాబాద్/జూన్03(మా అక్షరం): సైదాపూర్ ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ దళిత యువకుడిని అమానుషంగా చితకబాదిన ఘటనపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ తీవ్రంగా ఖండించారు.

మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ…. బాధితుడు మహేందర్‌ను భార్గవ్ కొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపించే వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఎస్సైగా వ్యవహరిస్తున్న భార్గవ్ ఒక నియంతలా, సైకోలా ప్రవర్తించాడు. అతని చేతుల్లో దళిత యువకుడు నిర్భందితుడై బూతులు వినిపించుకుంటూ, కొట్టించుకుంటూ బాధపడుతున్నాడు. ఇలాంటి ప్రవర్తన పోలీస్ వ్యవస్థపై మచ్చ వేస్తుంది,అని విమర్శించారు.ఇప్పటికే అనేక సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఎస్సై భార్గవ్‌పై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. అలాగే,ఈ దాడిలో పాల్గొన్న కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవికుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలి, అని డిమాండ్ చేశారు.పోలీసులపై గౌరవంతోనే ఇప్పటి వరకు దళితులు పెద్దఎత్తున ఉద్యమాల్లో పాల్గొనలేదని, అయితే ఇకపై మౌనం వీడాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !