+91 99635 77856

స్మశానవాటిక కలను నెరవేర్చిన యువనేత

Kudikala Sai Editor
maaksharamnews.in

స్మశానవాటిక కలను నెరవేర్చిన యువనేత

-తుమ్మనపల్లి గ్రామంలో ప్రణవ్ బాబు చొరవతో పనులు ప్రారంభం...
హుజురాబాద్/జూన్ 04 (మా అక్షరం): మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న స్మశానవాటిక కొరతకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు అనేకసార్లు అధికార ప్రతినిధులను, నాయకులను కోరినప్పటికీ స్పందన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో యువనేత ఒడితల ప్రణవ్ బాబును గ్రామస్థులు కోరగా, ఆయన వెంటనే స్పందించారు.తుమ్మనపల్లికి స్వయంగా వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించిన ప్రణవ్ బాబు, గ్రామానికి స్మశానవాటిక అత్యవసరమని గుర్తించారు. తాను స్వయంగా స్మశానవాటిక నిర్మాణానికి అవసరమైన ఖర్చు భరించడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.తాజాగా ఆయన ఆధ్వర్యంలో స్మశానవాటిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతకాలంగా ఎదురుచూసిన స్మశానవాటిక కల నెరవేరిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "ఇప్పటివరకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాయకుడెవ్వరూ లేరు. కానీ ప్రణవ్ బాబు వచ్చి ప్రత్యక్షంగా చూశారు, స్పందించారు, ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించారు" అంటూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు.గ్రామ ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తున్న ప్రణవ్ బాబు దృఢ సంకల్పానికి తుమ్మనపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

-తుమ్మనపల్లి గ్రామంలో ప్రణవ్ బాబు చొరవతో పనులు ప్రారంభం…
హుజురాబాద్/జూన్ 04 (మా అక్షరం): మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న స్మశానవాటిక కొరతకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు అనేకసార్లు అధికార ప్రతినిధులను, నాయకులను కోరినప్పటికీ స్పందన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో యువనేత ఒడితల ప్రణవ్ బాబును గ్రామస్థులు కోరగా, ఆయన వెంటనే స్పందించారు.తుమ్మనపల్లికి స్వయంగా వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించిన ప్రణవ్ బాబు, గ్రామానికి స్మశానవాటిక అత్యవసరమని గుర్తించారు. తాను స్వయంగా స్మశానవాటిక నిర్మాణానికి అవసరమైన ఖర్చు భరించడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.తాజాగా ఆయన ఆధ్వర్యంలో స్మశానవాటిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతకాలంగా ఎదురుచూసిన స్మశానవాటిక కల నెరవేరిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటివరకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాయకుడెవ్వరూ లేరు. కానీ ప్రణవ్ బాబు వచ్చి ప్రత్యక్షంగా చూశారు, స్పందించారు, ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించారు” అంటూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు.గ్రామ ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తున్న ప్రణవ్ బాబు దృఢ సంకల్పానికి తుమ్మనపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !