– బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు…
హుజురాబాద్/జూన్06(మాఅక్షరం):భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సకారం హుజురాబాద్ శిశుమందిర్ లో శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు పాల్గొన్నారు.వికషిత్ భారత్ అమృతకాలం సేవా,సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో మన బలగాల శౌర్య పరాక్రమాలను ప్రశంసిస్తూ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు.
మోడీ పాలన విజయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ పహాల్గంలోని మారణ హోమం ఉగ్ర దాడికి గురై 26 మంది అమాయక ప్రజల ఆడబిడ్డల సింధూరాన్ని కోల్పోయి దేశం మొత్తం అగ్రజ్వాల లు ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా కేవలం 23 నిమిషాలలోనే మన జవాన్లకు నష్టం వాటిల్లకుండా పాకిస్తాన్ మరియు పి ఓ కె లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి జవాన్ల వీరత్వం ఈ దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటినందుకు ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తానీ ఆర్థికంగా దెబ్బతీసి సిందూ జలాల ఒప్పందాన్ని రద్దుచేసారన్నారు. భారత దేశంలో తయారైన సైనిక సంపత్తి సాంకేతిక నిపుణులు ప్రపంచానికి గొప్పతనాన్ని చాటి చెప్పారని తీర్మానించారు. పౌరుల ప్రాణాలను కాపాడడానికి వీరోచితంగా పోరాటం చేసిన జవాన్ ను చూసి ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు గర్విస్తున్నామన్నారు.ప్రపంచం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి కొత్త నమ్మకం ప్రోత్సాహం ఇచ్చిందని తీర్మానించారు. దీనికి కార్యకర్తలు నాయకులు బలపరిచి ఆమోదించారు.
నరేంద్ర మోడీ ప్రధానిగా 11 సంవత్సరాల కాలంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి సాధించిందన్నారు. హుజురాబాద్ మునిసిపాలిటీలో భవిష్యత్ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.ప్రస్తుత కాంగ్రెస్ గత బిఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. హుజరాబాద్ మున్సిపాలిటీలోని అనేక సమస్యలు ముఖ్యంగా మిషన్ భగీరథ వల్ల పైపులైన్లు లీకేజీ రోడ్ల మరమ్మత్తుల నిర్లక్ష్యం అనేక సమస్యల పట్టణ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. కోతుల బెడద వల్ల మహిళలకు ముఖ్యంగా చిన్నారులకు గాయపరిచినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయన్నారు. కరీంనగర్ రోడ్డు మరియు వరంగల్ రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలి కరీంనగర్ రోడ్ కాలేజ్ మూలమలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రమాదాలను అరికట్టాలని కోరారు.
అంబేద్కర్ చౌరస్తాలో సిగ్నల్స్ ఏర్పాటుచేసి ప్రమాదాన్ని అరికట్టాలని కోరారు. హుజురాబాద్ డివైడర్లపై కోనోకార్పస్ చెట్లను సగం వరకే తీసేసి ఉంచడం వల్ల మళ్లీ కొమ్మలు పెరిగాయని ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కోనో కార్పస్ చెట్లను పూర్తిగా తొలగించాలని కోరారు.హుజురాబాద్ మున్సిపాలిటీ పైన రానున్న ఎలక్షన్ లో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు నాయకులు పార్టీ సూచన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలను సమాయత్తం చేసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లి చైతన్యం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ బియ్యం పేద ప్రజలకు అందుతున్నాయి అన్నారు. రేషన్ షాప్ వద్ద నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా ఉండాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కాషాయ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ మాజీ అద్యక్షులు గంగి శెట్టి రాజు, పట్టణ తాజమాజీ కాన్సిలర్ పైల వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, కో కన్వీనర్ బొరగల సారయ్య, కొలిపాక వెంకటేష్, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, సబ్బని రమేష్, తిప్పబతిని రాజు, పడారి కొమురయ్య, భాస్కర్ యాదవ్, కుసుమ సమ్మయ్య ,యాల రాజిరెడ్డి, చల్ మోహన్ ,బూత్ అద్యక్షులు తాళ్ళపల్లి దేవేంద్ర ,సబ్బని మాధవి, ఆవుల సదయ్య, క్యాసా వెంకటేశ్ ,అయిత సందీప్, గరిగే శివకృష్ణ, నీలం రవీందర్, కాపర్తి అనిల్, కొలుగూరి అనిల్, మల్లెల సరిత, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











