+91 99635 77856

ఘనంగా”ఆచార్య జయశంకర్ బడిబాట” కార్యక్రమం

హుజురాబాద్‌/జూన్06(మా అక్షరం): పట్టణంలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం “ఆచార్య జయశంకర్ బడిబాట – 2025” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొరగాల తిరుమల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు తిరుమల మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం ద్వారా వాటి స్థిరతను, నాణ్యతను కాపాడవచ్చని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్‌, షూస్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ లాంటి అవసరమైన వసతులు అందిస్తోందని వివరించారు. పాఠశాలలో మరుగుదొడ్లు, శుద్ధి చేసిన తాగునీరు, డైనింగ్‌ హాల్‌, గ్రంథాలయం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన ప్రదర్శనలు, విహారయాత్రలు వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.తద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం తరగతులు, మోటివేషన్ సెషన్లు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని దత్తత తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ… తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినవాడినే అని, ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్‌గా పని చేయడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలాన్ని చూపిస్తున్నదని అన్నారు. డైనింగ్ హాల్‌కు వైట్‌వాష్‌, గ్రిల్స్ ఏర్పాటుకు తనవంతుగా ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్ కల్లేపల్లి రమాదేవి, రిటైర్డ్ హెడ్మాస్టర్లు వేల్పుల రత్నం, గుంటి రాజయ్య, సొల్లు సారయ్య, ఉపాధ్యాయులు సాదుల రవీందర్‌బాబు, పాత్రికేయుడు కేసరి మధుకర్‌రావు, ప్రజా సంఘాల నేతలు వేల్పుల ప్రభాకర్, బండ కిషన్‌, ఉపాధ్యాయులు పలకల ఈశ్వర్ రెడ్డి, ఆసియా, రోజారాణి, మాధవి లత, సంపత్ కుమార్, శ్రావణి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !