+91 99635 77856

ఆడబిడ్డల పెళ్లికి నాగార్జున డెయిరీ అండగా

Kudikala Sai Editor
maaksharamnews.in

ఆడబిడ్డల పెళ్లికి నాగార్జున డెయిరీ అండగా

హుజూరాబాద్ /జూన్ 07 (మా అక్షరం):
మంథనపల్లి గ్రామానికి చెందిన మంతెన ఐలయ్య కుమార్తె మంతెన సుకన్య వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. డెయిరీ తరఫున వధువుకు రూ.10,116 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాకర్ రావు నాగార్జున డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న ప్రతి పాడి రైతు కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి మట్టెలుగా బదులుగా రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నాం,అని తెలిపారు. ఇప్పటివరకు 577 మంది ఆడబిడ్డల వివాహాలకు రూ.58,36,932 సహాయం అందించామని వెల్లడించారు.పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ ద్వారా పశువుల కొనుగోలు రుణాలు, సాధారణ బీమా, ప్రమాద బీమా, లక్ష రూపాయల పశువుల బీమా, తగిన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు వివరించారు.ఈ సేవా కార్యక్రమాల వలన రైతులు మమ్మల్ని కుటుంబ సభ్యుల్లా భావిస్తూ విశ్వాసంతో మద్దతు ఇస్తున్నారు,అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ గణేష్ రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్, సీసీఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ శ్రీధర్ రావు, స్థానిక ఏజెంట్ నరేందర్ రెడ్డి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !