హుజూరాబాద్/ జూన్10 (మా అక్షరం): భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొన్న హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు గ్రామానికి చెందిన జవాన్ రామారపు తిరుపతిని హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కే. హరి ప్రసాద్ మాట్లాడుతూ… దేశ రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వీరయోధుడిని సత్కరించడం మాకు గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మతిన్, ఇతర సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 157











