+91 99635 77856

సిర్సపల్లిలో విద్యా వాహిని ప్రచార రథం

Kudikala Sai Editor
maaksharamnews.in

సిర్సపల్లిలో విద్యా వాహిని ప్రచార రథం

హుజూరాబాద్ /జూన్ 11 (మా అక్షరం):
తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన విద్యా వాహిని – బడి బాట ప్రచార కార్యక్రమం బుధవారం హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో జోరుగా కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్, విద్యాధికారుల సూచనల మేరకు విద్యా వాహిని ప్రచార రథాన్ని అన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసిల్దార్ కనకయ్య మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని,గ్రామస్తులంతా కలిసి పాఠశాల అభివృద్ధికి భాగ్యస్యములు కావాలని పిలుపునిచ్చారు.ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో ఉత్తమ విద్య, అవసరమైన అన్ని సదుపాయాలు లభ్యమవుతున్నాయని,విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు విజయ్ కుమార్, లక్ష్మణ్, కొండాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, దాతలు వెంకట్ రెడ్డి, సదాశివరెడ్డి, రవి, ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు దోమల సదానందం, డిపిఇపీ పాఠశాల ఇన్‌చార్జ్ తాళ్ల తిరుపతి, ఉపాధ్యాయులు కొండి రవీందర్, అల్లంకి శ్రీనివాస్, సిఆర్‌పి రమేష్, గ్రామ యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్ /జూన్ 11 (మా అక్షరం):
తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన విద్యా వాహిని – బడి బాట ప్రచార కార్యక్రమం బుధవారం హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో జోరుగా కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్, విద్యాధికారుల సూచనల మేరకు విద్యా వాహిని ప్రచార రథాన్ని అన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసిల్దార్ కనకయ్య మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని,గ్రామస్తులంతా కలిసి పాఠశాల అభివృద్ధికి భాగ్యస్యములు కావాలని పిలుపునిచ్చారు.ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో ఉత్తమ విద్య, అవసరమైన అన్ని సదుపాయాలు లభ్యమవుతున్నాయని,విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు విజయ్ కుమార్, లక్ష్మణ్, కొండాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, దాతలు వెంకట్ రెడ్డి, సదాశివరెడ్డి, రవి, ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు దోమల సదానందం, డిపిఇపీ పాఠశాల ఇన్‌చార్జ్ తాళ్ల తిరుపతి, ఉపాధ్యాయులు కొండి రవీందర్, అల్లంకి శ్రీనివాస్, సిఆర్‌పి రమేష్, గ్రామ యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !