+91 99635 77856

విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి

-బస్సు పాస్ పెంపు నిర్ణయం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే…
-విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి …
-ఏఐఎస్ఎఫ్ మండల సమితి డిమాండ్…

హుజురాబాద్/జూన్ 11(మా అక్షరం): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, బుధవారం ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు దొమ్మటి వేణు గోపాల్, రాంపెల్లి రోహిత్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలోని 10లక్షలకు పైగా పేద,మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళ్తుంటారని ఈ చార్జీల పెంపు ద్వారా వారిపై పెను భారం పడుతుందని ఆర్టీసీ యాజమాన్యం నెలకు రూ .400 ఉన్న బస్ పాస్ చార్జీని రూ.600 కు పెంచుతూ 3నెలల ప్యాకేజీని రూ.1200 నుంచి రూ.1800 పెంచుతూ 20% పైగా చార్జీలను పెంచి పేద మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపారని, ప్రభుత్వం విద్యార్థులకు ఇప్పటికే ఇవ్వాల్సిన స్కాలర్షిప్లను ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు బస్ పాస్ చార్జీలను పెంచడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా బస్సు చార్జీల పెంచినమంటే అదే విధంగా విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను కూడా పెంచాలని, ఆర్టీసీలో విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని పెంచిన 20 శాతం బస్సు చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !