+91 99635 77856

అంగన్వాడి కేంద్రంలో ‘అమ్మ మాట – అంగన్వాడి బాట

Kudikala Sai Editor
maaksharamnews.in

అంగన్వాడి కేంద్రంలో ‘అమ్మ మాట – అంగన్వాడి బాట

హుజూరాబాద్ /జూన్ 11(మా అక్షరం): పట్టణంలోని వివేకానందనగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ...అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించబడుతున్న పౌష్టికాహారాన్ని తల్లులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రీ-స్కూల్ హాజరును మెరుగుపర్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.ఈ సందర్భంగా సీడీపీఓ సుగుణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అనంతరం చైల్డ్ లేబర్ రహిత సమాజంపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించి, చైల్డ్ లేబర్ నివారణపై ఓ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, ఐసిపిఎస్ సోషల్ వర్కర్ రమేష్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్ /జూన్ 11(మా అక్షరం): పట్టణంలోని వివేకానందనగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ…అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించబడుతున్న పౌష్టికాహారాన్ని తల్లులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రీ-స్కూల్ హాజరును మెరుగుపర్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.ఈ సందర్భంగా సీడీపీఓ సుగుణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అనంతరం చైల్డ్ లేబర్ రహిత సమాజంపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించి, చైల్డ్ లేబర్ నివారణపై ఓ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, ఐసిపిఎస్ సోషల్ వర్కర్ రమేష్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !