+91 99635 77856

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

హుజురాబాద్/జూన్19 (మా అక్షరం):దేశ రాజకీయం లో ప్రజల పక్షాన ధైర్యంగా నిలిచే నేత రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వొడితల ప్రణవ్ మాట్లాడుతూ...రాహుల్ గాంధీ ప్రజల సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తిన నాయకుడు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా దేశ ప్రజల మధ్య న్యాయబద్ధ సమాజ నిర్మాణానికి కృషి చేశారు. తెలంగాణలో కుల గణనకు మద్దతుగా వర్గాలన్నింటికీ న్యాయం కల్పించే దిశగా ఆయన పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం ద్వారా జన్మదినాన్ని ఘనంగా జరిపారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, యువజన విభాగం, మహిళా విభాగం, యువజన కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సేవాదళ్ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/జూన్19 (మా అక్షరం):దేశ రాజకీయం లో ప్రజల పక్షాన ధైర్యంగా నిలిచే నేత రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వొడితల ప్రణవ్ మాట్లాడుతూ…రాహుల్ గాంధీ ప్రజల సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తిన నాయకుడు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా దేశ ప్రజల మధ్య న్యాయబద్ధ సమాజ నిర్మాణానికి కృషి చేశారు. తెలంగాణలో కుల గణనకు మద్దతుగా వర్గాలన్నింటికీ న్యాయం కల్పించే దిశగా ఆయన పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం ద్వారా జన్మదినాన్ని ఘనంగా జరిపారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, యువజన విభాగం, మహిళా విభాగం, యువజన కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సేవాదళ్ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !