+91 99635 77856

కరాటే విజేతలకు ఘన సన్మానం

హుజురాబాద్/ జూన్20 (మా అక్షరం): పట్టణంలోని న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ షోటో ఖాన్ కరాటే డూ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఎస్.కే. జలీల్ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ…కరాటే మాస్టర్ ఎస్‌.కే. జలీల్ ఎంతో కృషితో విద్యార్థులను శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు. కరాటే శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడే విద్య. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇది ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ సొల్లు సారయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఖలీద్ హుస్సేన్, ఆకుల సదానందం, బత్తుల రాజకుమార్, టి.గోపాల్, దాసరి మల్లేశం, ఎండి. సల్మాన్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !