+91 99635 77856

సకాల వర్షాల కోరికతో కప్పతల్లి పూజ

-పెద్ద పాపయ్యపల్లిలో సంప్రదాయ ఆచరణ
హుజురాబాద్/ జూన్ 20 (మా అక్షరం):
మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో శుక్రవారం వర్షాభావాన్ని పోగొట్టేందుకు గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి పూజ నిర్వహించారు. వానలు సకాలంలో కురిసి పంటలకు అనుకూలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రైతులు, మహిళలు కలిసి కప్పలను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు.పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. వర్షాలు కురవడంతో పంటలు పండుతాయని అన్నదాతలు సంతోషంగా జీవించగలరని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. పాతకాలం నుంచి ఈ రీతిలో పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. వర్షాలు పడే వరకు పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రావుల వేణుగోపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !