హుజూరాబాద్/జూన్ 25 (మా అక్షరం):పట్టణాన్ని పర్యావరణ అనుకూలంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దే 100 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని 28వ వార్డులోని విద్యానగర్ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు.ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన గడ్డి మొక్కలు, చెత్తను తొలగించారు. మురికి కాలువల్లో పేరుకున్న సిల్ట్‌ను శుభ్రం చేసి వరదనీరు రోడ్లపైకి చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే రోడ్లపై ఉన్న మొరం, ఇసుక కుప్పలను జెసిబి లతో తొలగించారు.ఈ సందర్భంగా విద్యానగర్ ప్రాంతంలోని సాస్ర పబ్లిక్ స్కూల్, స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేసే విధానం గురించి అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ విన్సెంట్, నేరెళ్ళ వేణుమాధవ్, పురపాలక సంఘ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. సుధాకర్, సీనియర్ సహాయకులు జె. శ్రీకాంత్, జూనియర్ సహాయకులు రాజయ్య, వార్డు అధికారులు, సానిటరీ సిబ్బంది రోంటాల సుధీర్, ప్రతాపరాజు, ఆరెల్లి రమేష్, టి. కుమారస్వామి, పి. అనిల్ కుమార్, మెప్మా సి ఎల్ ఆర్ పి లు కరుమల్ల స్వరూప, ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.











