+91 99635 77856

మత్తుపదార్థాలపై విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమం..

Kudikala Sai Editor
maaksharamnews.in

మత్తుపదార్థాలపై విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమం..

హుజూరాబాద్/ జూన్ 26 (మా అక్షరం):
యువతలో మత్తుపదార్థాల దుర్వినియోగాన్ని నివారించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆదేశాల మేరకు హుజూరాబాద్ పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హుజురాబాద్ గర్ల్స్ హైస్కూల్, చెల్పూర్ హైస్కూల్‌లలో విద్యార్థుల మధ్య డ్రగ్స్ పై వ్యతిరేకతతో రచన పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో హుజురాబాద్ జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్‌కి చెందిన ఎల్. లక్ష్మీ ప్రసన్న ప్రథమ బహుమతిని గెలుచుకోగా, చెల్పూర్ హైస్కూల్‌కు చెందిన రాంపూర్ గ్రామానికి చెందిన గట్టు హరిణి ద్వితీయ బహుమతిని, అదే స్కూల్‌కు చెందిన ఏదులాపురం శృతి తృతీయ బహుమతిని సాధించింది. గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ విజేతలకు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !