-పాఠశాలలలో పుస్తకాల విక్రయాన్ని వ్యతిరేకించిన విద్యార్థి సంఘాలు…
హుజూరాబాద్ /జూన్ 26 (మా అక్షరం):
విద్యను వ్యాపారంగా మార్చే విధంగా ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని విద్యార్థి యువజన సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు.గురువారం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పాఠశాలల ఆవరణలో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయించడం పూర్తిగా నిషేధితమని, అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాల యాజమాన్యాలు స్వేచ్ఛగా పుస్తకాలు అమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.పాఠశాల ఆవరణలో పుస్తకాలు విక్రయిస్తే భౌతిక దాడులు కూడా జరుగుతాయన్నది మా హెచ్చరిక,” అని నాయకులు స్పష్టం చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని, లేదంటే అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.వారు పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో టేకుల శ్రావణ్, కొలుగూరి సూర్యకిరణ్, పర్లపల్లి నాగరాజు, కర్ర శ్రీధర్ రెడ్డి, పంజాల రేవంత్, గండు ప్రశాంత్ యాదవ్, ఆలేటి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.











