-మనపల్లె మస్తీ యూట్యూబ్ చానల్ సమర్పణలో రూపొందిన ప్రత్యేక పాట…
హుజూరాబాద్/జూన్ 26 (మా అక్షరం):
రాఖీ పండుగను పురస్కరించుకొని, అన్నా–చెల్లెళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన ప్రత్యేక రాఖీ పాట చిత్రీకరణ పూర్తయిందని పాట రచయిత, గాయకుడు అనపురం రమేశ్ గౌడ్ గురువారం వెల్లడించారు.ఈ పాటను మనపల్లె మస్తీ యూట్యూబ్ చానల్ సమర్పణలో కొదురుపాక గ్రామంలో చిత్రీకరించారు.ఈ పాటలో నటీనటులుగా కత్తెరపాక శ్రీనివాస్,రాధిక, రజిని,అనపురం రమేశ్ గౌడ్, రాధ, సరక్క, భవాని, సదానందం, సరోజన మరియు చిన్నారి నటీనటులుగా హిమశ్రీ, రీతు, అనుమిత సామెల్‌లు పాల్గొన్నారు.పాటకు దర్శకత్వం కత్తెరపాక శ్రీనివాస్ అందించగా, ఛాయాగ్రహణం (DOP), DI బాధ్యతలు జీవన్ బట్టు చేపట్టారు.సంగీతాన్ని కాయి తోజు ప్రవీణ్ అందించగా, గాయకులుగా లావణ్య, సరక్క, అనపురం రమేశ్ గౌడ్ గళం కద్దించారు.”అన్నా–చెల్లెళ్ల బంధాన్ని అద్దంలా ప్రతిబింబించేలా పాటను రూపొందించాం. రాఖీ పండుగకల్లా ఈ పాటను మనపల్లె మస్తీ యూట్యూబ్ చానల్ లో విడుదల చేయనున్నాం” అని అనపురం రమేశ్ గౌడ్ తెలిపారు.











