+91 99635 77856

ఘనంగా పీవీ జయంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా పీవీ జయంతి వేడుకలు

హుజురాబాద్/ జూన్ 28 (మా అక్షరం): భారత రత్న, మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 104వ జయంతిని శనివారం పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోట రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యాయవాది ముక్కెర రాజు, ఐఎంఏ డాక్టర్ రామలింగ రెడ్డి మాట్లాడుతూ... ‘‘దేశాభివృద్ధిలో పీవీ నరసింహారావు పాత్ర ఎనలేనిది. ప్రపంచం గర్వించే మేధావి మన ప్రాంత వాస్తవ్యుడిగా ఉండడం గర్వకారణం. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించడం హర్షదాయకం'' అని తెలిపారు.ప్రజల ఆకాంక్ష మేరకు హుజురాబాద్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మనోజ్, డాక్టర్లు తోగరు విద్యాసాగర్, ప్రదీప్ రావు, ఏఎస్ఐ బండ సంపత్ రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మురికి గౌరీశంకర్, రావుల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ జూన్ 28 (మా అక్షరం): భారత రత్న, మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 104వ జయంతిని శనివారం పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోట రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యాయవాది ముక్కెర రాజు, ఐఎంఏ డాక్టర్ రామలింగ రెడ్డి మాట్లాడుతూ… ‘‘దేశాభివృద్ధిలో పీవీ నరసింహారావు పాత్ర ఎనలేనిది. ప్రపంచం గర్వించే మేధావి మన ప్రాంత వాస్తవ్యుడిగా ఉండడం గర్వకారణం. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించడం హర్షదాయకం” అని తెలిపారు.ప్రజల ఆకాంక్ష మేరకు హుజురాబాద్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మనోజ్, డాక్టర్లు తోగరు విద్యాసాగర్, ప్రదీప్ రావు, ఏఎస్ఐ బండ సంపత్ రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మురికి గౌరీశంకర్, రావుల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !