+91 99635 77856

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ అస్తవ్యస్తం…

– స్థానికుల నుంచి అధికారులకు విన్నపం…
ప్రతి గురువారం నిర్వహించే అంగడి మసీదు వద్ద ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది..
హుజురాబాద్/ జూన్ 28(మా అక్షరం): పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నలుమూలల్లో గతంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించేవారు. అయితే, గత నెల, రెండు నెలలుగా ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీలో కనిపించకపోవడంతో చౌరస్తా వద్ద ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. దీనివల్ల అక్కడుగా ప్రయాణించే వాహనదారులకు తీవ్ర అసౌకర్యాలు కలుగుతున్నాయి. పలు ప్రమాదాలు కూడా నమోదవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ ప్రజలు అధికారులను వినమ్రంగా కోరుతున్నది ఏమనగా ఈ ప్రాంతానికి తిరిగి ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలను పర్యవేక్షించి క్రమబద్ధీకరించాలి.

గురువారం అంగడి రోడ్డుపై నిర్వహించబడుతోంది. …

ప్రతి గురువారం జమ్మికుంట రోడ్డు లోని మసీదు వద్ద అంగడి నిర్వహించే వ్యాపారులు రోడ్డుపైకి తమ స్టాల్లు ఏర్పాటు చేస్తున్నారని, దీని వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికులు ఆ రోడ్డులో వెళ్లడానికే ఇబ్బందిపడుతున్నారు.కావున, ప్రజల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !