అభివృద్ధి చేస్తున్న కమిషనర్‌పై అసత్య ఆరోపణలు తగదు
-దళిత సంఘాల ఆగ్రహం…
హుజూరాబాద్/ జూన్ 30 (మా అక్షరం):
హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిషనర్ కెంసారపు సమ్మయ్యపై కావాలని కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు విమర్శించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారేపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నేత కలవల మల్లయ్య, జిల్లా కార్యదర్శి కుమార్, కే. సంపత్ కుమార్ మాట్లాడారు….కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధికి దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అన్ని వార్డుల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, స్వచ్ఛ హుజూరాబాద్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, జిల్లా స్థాయి అధికారుల ప్రశంసలు పొందినట్లు తెలిపారు.మున్సిపల్ చరిత్రలోనే తొలిసారి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో మున్సిపాలిటీకే మంచి పేరు తీసుకొచ్చిన ఘనత సమ్మయ్యకు దక్కుతుందన్నారు. వేసవి సెలవుల్లో యువతకి మానసికోల్లాసం కలిగించే ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలను నెల రోజులపాటు నిర్వహించినట్లు చెప్పారు.కమిషనర్ పనిచేసే తీరును చూసి భరద్వాజ్ అనే వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ కారణాల వల్ల కాంట్రాక్టు ఆలస్యం అయినప్పటికీ, దాన్ని అనర్హంగా వదిలి అసత్య ప్రచారానికి దిగడం సరికాదన్నారు. గతంలో భరద్వాజ్ కాంట్రాక్టులో భాగంగా కేటాయించిన పనిలో కొంత చేయగా మిగతాది పూర్తిచేయలేదని వివరించారు.అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులపై నిందలు మోపడం అన్యాయమని, ప్రజలు నిజాన్ని గుర్తించాలన్నారు.











