+91 99635 77856

Kudikala Sai Editor
maaksharamnews.in

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం
- మేడారం, రామప్ప, లక్నవరం, మల్లూరు ఆలయాల సందర్శనకు హైదరాబాద్ డిపో ఏర్పాటు...

హుజూరాబాద్/ జూలై 01 (మా అక్షరం):
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మేడారం, రామప్ప, లక్నవరం ,మల్లూరు నరసింహస్వామి ఆలయాల సందర్శన కోసం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యం ఈనెల 6న అందుబాటులో ఉంటుందని మంగళవారం డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సు హుజూరాబాద్ నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6:00 గంటలకు తిరిగి వస్తుందన్నారు.ప్రయాణ ఛార్జీలు పెద్దలకు రూ.800/-గా, పిల్లలకు రూ.500/-గా నిర్ణయించబడినట్టు తెలిపారు. ముందస్తుగా సీట్లు బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ కోసం కింది నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. 99592 25924,97048 33971,92471 59535,91773 24963,భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Share ePaper Clip

Preparing image...

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం
– మేడారం, రామప్ప, లక్నవరం, మల్లూరు ఆలయాల సందర్శనకు హైదరాబాద్ డిపో ఏర్పాటు…

హుజూరాబాద్/ జూలై 01 (మా అక్షరం):
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మేడారం, రామప్ప, లక్నవరం ,మల్లూరు నరసింహస్వామి ఆలయాల సందర్శన కోసం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యం ఈనెల 6న అందుబాటులో ఉంటుందని మంగళవారం డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సు హుజూరాబాద్ నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6:00 గంటలకు తిరిగి వస్తుందన్నారు.ప్రయాణ ఛార్జీలు పెద్దలకు రూ.800/-గా, పిల్లలకు రూ.500/-గా నిర్ణయించబడినట్టు తెలిపారు. ముందస్తుగా సీట్లు బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ కోసం కింది నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. 99592 25924,97048 33971,92471 59535,91773 24963,భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !