+91 99635 77856

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు

హుజురాబాద్‌/జూలై0 9(మా అక్షరం):

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా పట్టణంలో బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టగా, ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఉద్యోగులు, విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ శాఖ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో నిరసన వెలిబుచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఈ సంస్థలను ప్రైవేట్ క్షేత్రానికి అప్పగించడం ప్రజలకు అనేక విధాలుగా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలే సామాన్యులకు ఆశ్రయంగా నిలుస్తున్నాయి. ఇవి నష్టాల్లో ఉన్నాయనే పేరు పెట్టి ప్రైవేటీకరణ చేయడాన్ని అంగీకరించం, అని పేర్కొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !