+91 99635 77856

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడికి గౌరవ డాక్టరేట్‌

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడికి గౌరవ డాక్టరేట్‌

హుజూరాబాద్‌ /జూలై10 (మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చరిత్ర అధ్యాపకునిగా పని చేస్తున్న వడ్డేపల్లి సాయిచరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించింది. చరిత్ర పట్ల ఉన్న మక్కువతో కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ తాళ్లపెల్లి మనోహర్‌ మార్గదర్శకత్వంలో ‘‘1853 నుండి 1948 వరకు హైదరాబాద్‌ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు’’ అనే అంశంపై నాలుగేళ్లపాటు పరిశోధన చేశారు.తన పరిశోధన ఫలితాలను విశ్వవిద్యాలయానికి సమర్పించగా, విశ్వవిద్యాలయ అధికారులు పరిశీలించి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. ఇటీవల విశ్వవిద్యాలయంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌వర్మ సాన్నిధ్యంలో జరిగిన స్నాతకోత్సవంలో డాక్టర్‌ సాయిచరణ్‌కు డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు.ఈ సందర్భంగా గురువారం కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్‌ వి.ఆంజనేయరావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని డాక్టర్‌ సాయిచరణ్‌ను ఘనంగా అభినందించారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !