+91 99635 77856

డిఎస్పి మహేష్ మృతి …అత్యంత బాధాకరం..

Kudikala Sai Editor
maaksharamnews.in

డిఎస్పి మహేష్ మృతి …అత్యంత బాధాకరం..

-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు...

కరీంనగర్/ జూలై 18 (మా అక్షరం): కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డీఎస్పీగా పని చేస్తున్న మహేష్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.పోలీస్ శాఖలో 1995 బ్యాచ్ కు చెందిన మహేష్ ఎస్ఐ స్థాయి నుంచి అంచెలంచలుగా డిఎస్పి స్థాయి వరకు ఎదిగారని గుర్తు చేశారు.అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖలో మంచి పేరు సంపాదించుకున్నారని, అలాంటి పోలీస్ అధికారి మరణం దురదృష్టకరమన్నారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ మహేష్, వారి ఫ్యామిలీతో తనతో పాటు తన తండ్రి వెలిచాల జగపతిరావు కి ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మహేష్ తమ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అని, వారి మృతి తీరని లోటు అని రాజేందర్ రావు విచారం వ్యక్తం చేశారు.డిఎస్పీ మాధవి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజేందర్ రావు పేర్కొన్నారు

Share ePaper Clip

Preparing image...

-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు…

కరీంనగర్/ జూలై 18 (మా అక్షరం): కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డీఎస్పీగా పని చేస్తున్న మహేష్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.పోలీస్ శాఖలో 1995 బ్యాచ్ కు చెందిన మహేష్ ఎస్ఐ స్థాయి నుంచి అంచెలంచలుగా డిఎస్పి స్థాయి వరకు ఎదిగారని గుర్తు చేశారు.అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖలో మంచి పేరు సంపాదించుకున్నారని, అలాంటి పోలీస్ అధికారి మరణం దురదృష్టకరమన్నారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ మహేష్, వారి ఫ్యామిలీతో తనతో పాటు తన తండ్రి వెలిచాల జగపతిరావు కి ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మహేష్ తమ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అని, వారి మృతి తీరని లోటు అని రాజేందర్ రావు విచారం వ్యక్తం చేశారు.డిఎస్పీ మాధవి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజేందర్ రావు పేర్కొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !