+91 99635 77856

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

Kudikala Sai Editor
maaksharamnews.in

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

-భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి...
-కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ..
హుజురాబాద్/ జులై 23 (మా అక్షరం): వాతావరణ శాఖ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధికారులను కోరారు.వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు.వర్షాకాలంలో విష జ్వరాలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. బుధవారం రోజున ఐదు మండలాల ఎంపీడీవోలు, రెండు పట్టణాల కమిషనర్లతో సమావేశమై అవసరమైన సూచనలు చేశారు.రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాల్లోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరెంట్ స్తంభాలు, విద్యుత్ లైన్ల పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

-భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !