+91 99635 77856

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు..

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు..
– తాత ఆశయాలను కొనసాగిస్తా…
– ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తా..
హుజురాబాద్/జులై 24 (మా అక్షరం): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 14 వర్ధంతిని గురువారం పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యునిగా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా అనేక సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని,వారి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని,ఆనాటి ప్రధానమంత్రి పి.వీ.నరసింహరావుకు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేసి రాజకీయ చతురత ప్రదర్శించారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్య,వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు.అనంతరం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వర రావు అభిమానులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !