+91 99635 77856

రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలి…

ఎల్కతుర్తి/జులై 24 (మా అక్షరం):

మండలంలోని గురువారం రోజున తిమ్మాపూర్ గ్రామంలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణనిధి నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (బీసీఐ )ఉత్తమ పత్తి యాజమాన్య పథకం ఆధ్వర్యంలో బీసీఐ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఫెసిలిటర్ వంగ రఘు మాట్లాడుతూ సహజ వనరులు సమగ్ర సస్యరక్షణ పురుగుమందుల కొనుగోలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు తమ పత్తి చేనులో అంతర రక్షక ఏర, పంటలు సాగు చేస్తూ, పంట వైవిధ్యాన్ని పాటించాలని, సరైన పోషకాలు, సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన మోతాదులో వాడుకోవాలని, పశువులపెంట చెరువు మట్టి బయో ఫెర్టిలైజర్స్ వినియోగించి భూసారం పెంచుకోవాలని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులు వాడాలని,పూత, కాత దశలలో సాలు విడిచి సాలు పద్ధతిలో నీటి తడులు అందించాలని, 45 రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారి చేయకుండా వావిలాకు,వేప కషాయం తయారు చేసుకొని వాడుకోవాలని, ట్రైకోడెర్మా విరిడి, బావేరియా, సుడోమోనాస్ లాంటి జీవన ఎరువులు ఉపయోగించాలని, పంట ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిన తర్వాత తక్కువ విష ప్రభావం కలిగిన పురుగుమందులను బొట్టు పద్దతిలో చేసుకోవాలని, పురుగుమందుల పిచికారి సమయంలో తప్పనిసరి సరైన పరికరాలతో సరైన వాతావరణ పరిస్థితుల్లోనే పిచికారి చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు పురుగుమందులపై శిక్షణ నైపుణ్యం కలిగి ఉండాలని, గర్భిణీ స్త్రీలు బాలింతలు పిచికారి సమయంలో వెళ్లినట్లయితే అనారోగ్యం అంగవైకల్యం వస్తుందని, వాడిన పురుగుమందు డబ్బాలను నిర్వీర్యం చేయాలని తద్వారా నీటి ఆవరణ వ్యవస్థ కాపాడవచ్చని, ఒకే గ్రూపుకు చెందిన పురుగుమందులను మళ్లీమళ్లీ స్ప్రే చేయకూడదని, అత్యధిక విషపూరితమైన పురుగు మందులు వాడకూడదని వాటికి ప్రత్యామ్నాయ పురుగుమందులను వాడుకోవాలని,అత్యంత విషపూరితమైన పురుగుమందులను దశలవారీగా తగ్గించాలని తెలపడం జరిగింది. మరియు రైతులు సేంద్రియ వ్యవసాయానికి రావాలని, పంటలో వచ్చే చీడపీడల నివారణకు అగ్నస్త్రం, దశపర్ణి కాషాయం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ,నిమస్త్రం, వంటి కషాయాలు వాడడం వల్ల పంటలో పురుగులు తెగుళ్లు నివారించుకోవచ్చని తెలపడం జరిగింది. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల రైతులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని తెలపడం జరిగింది. ఆసక్తి ఉన్న 20 మంది రైతులకు కషాయాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 80 మంది గ్రామ రైతులు మరియు బిసిఐ ఫీల్డ్ ఫెసిలిటేటర్స్ మౌనిక, లత, మోహన్, రాజేందర్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !