+91 99635 77856

జమ్మికుంటలో భూ కబ్జాదారుల నుండి ప్రాణభయం…

– కబ్జాదారులకే పోలీసుల అండదండలు….
– నా సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్యే శరణ్యం..
-బాధితుడు సురేష్ ఆవేదన..
​హుజూరాబాద్/ ఆగస్టు07 (మా అక్షరం):
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్న పల్లెకు చెందిన పురేళ్ల సురేష్ అనే యువకుడు తన కుటుంబానికి భూ కబ్జాదారుల నుండి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమికి అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణం అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. దీని వెనుక స్థానిక రాజకీయ నాయకులు, పోలీసుల అండ ఉందని సురేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయన హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
2012లో తన తండ్రి పురేళ్ల భద్రయ్య, పెదనాన్న పురేళ్ల రాజయ్య వద్ద మూడు గుంటల భూమిని కొనుగోలు చేశారని సురేష్ తెలిపాడు. ఈ భూమికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నాలా కన్వర్షన్, మున్సిపల్ పర్మిషన్, రెవెన్యూ పత్రాలు అన్నీ తమ పేరుపై ఉన్నాయని చెప్పాడు. అయినప్పటికీ, కౌటం ప్రమీల, పార్వతి సుమన్ అనే వ్యక్తులు ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని, దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించాడు.ఈ విషయమై జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్‌కి నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా, అది సివిల్ తగాదా అని చెప్పి తన దరఖాస్తును పట్టించుకోవడం లేదని సురేష్ వాపోయాడు. సీపీకి ఫిర్యాదు చేసినా, సీఐ తప్పుదోవ పట్టించి తనపైనే కేసు నమోదు చేయించేలా తమ వ్యతిరేకులను పురమాయిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో సురేష్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించగా, సీఐపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపాడు.అధికారులు, పోలీసులు తన భూమిలో ఇల్లు నిర్మించుకోవడానికి సహకరించాలని సురేష్ కోరాడు. తనకు, తన కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !