హుజూరాబాద్/ఆగస్టు07(మా అక్షరం):హుజురాబాద్ పట్టణంలో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టణంలోని అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్స్ దాడులు జరిపారు. గంజాయి మత్తు పదార్థాలు రహస్యంగా నిల్వచేస్తున్నారన్న సమాచారంతో,రద్దీ ప్రదేశాల్లో నార్కోటిక్స్ టీం, డాగ్ స్క్వాడ్ తో కలిసి తనిఖీలు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించి, కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ప్రధాన కూడళ్లలో నాకాబంది నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ సబ్ డివిజన్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
Post Views: 396











