మృతి చెందిన నేత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం
హుజురాబాద్/ఆగస్టు10 (మా అక్షరం):హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన నేత కార్మికుడు మండల సుదర్శన్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా హుజురాబాద్ చేనేత సహకార సంఘం పర్సనల్ ఇంచార్జి ఎలిగేటి ఉపేందర్, మేనేజర్ నక్క వైకుంఠం, అసిస్టెంట్ మేనేజర్ మంచికట్ల కోటిలింగం, మృతుని భార్య మండల లలితకు అంత్యక్రియల నిమిత్తం రూ.8 వేల ఆర్థిక సాయం అందజేశారు.సుదర్శన్ చేనేత సంఘంలో దీర్ఘకాలం పనిచేసి విశేష సేవలు అందించారని వారు గుర్తుచేశారు. నేతన్న బీమా పథకం ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించేందుకు సంఘం తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Post Views: 221











