+91 99635 77856

గంజాయి వద్దు.. ఆరోగ్యం ముద్దు!

-గంజాయి వద్దు.. ఆరోగ్యం ముద్దు…
– సామాజిక కార్యకర్త వేణుగోపాల్ ప్రచారం…

హుజురాబాద్/ ఆగస్ట్ 08 (మా అక్షరం): గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ శుక్రవారం పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు ఆ అనే బోర్డును తన మెడలో వేసుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసు ఎస్సార్ ఆసుపత్రి ఏరియా, భరత్ పంప్ ఏరియా, సిరసపల్లి క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు గ్రహీత నలుబాల వేణుగోపాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి ఇతర నిషేధిత మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని కోరారు. డ్రగ్స్, గంజాయి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సమూలంగా అరికట్టాలన్నారు. డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందుకు అనుగుణంగా ఇటీవల ఉక్కు పాదం మోపుతోందని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతూ గంజాయినీ సేవించడం ఎంతో బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా గంజాయి వినియోగం ఇటీవల పెరుగుతున్నట్లు మీడియా ద్వారా తెలుస్తుందని ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని వేణుగోపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి రమేష్, మడుగు రమేష్, కారంకంటి రవీందర్, ఆదిమూలము అజయ్, కొల్లూరి ఆనంద్, పరకాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !