హుజురాబాద్/ఆగస్టు 16 (మా అక్షరం):
హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో టెట్రా హెడ్రన్ మోడల్ స్కూల్ ఆవరణంలో త్రైత సిద్ధాంతం వారి ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక హుజరాబాద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా శనివారం శ్రీకృష్ణ భగవాన్ వారి ప్రతిమను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించామని హుజురాబాద్ కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలోని శ్లోకాలను వచనాలను ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో అర్థం అయ్యే విధానంగా రూపొందించడం జరిగింది అని అన్నారు. దైవ జ్ఞాన విశేషాల్లో భాగంగా దేవాలయం సంప్రదాయాల్లో ఆత్మజ్ఞానం,తెలుగు పండుగల విశిష్టత, మరియు తెలుగు నెలల విశిష్టత, త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకముల సారముతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నాయని ప్రజలందరూ దైవ జ్ఞానం గ్రంథాలను చదివి ఆచరణలో తెచ్చుకొని దైవ సన్నిధి మోక్షం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్దాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక హుజురాబాద్ కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి, సభ్యులు సతీష్ చారి, గోపికృష్ణ, తిరుపతి, రాహుల్, శ్రావణ్, సిద్ధార్థ్, అభిరామ్, రామస్వామి, రాంబాబు, శ్రీధర్, శివ సాయి, ఫణిందర్, కుమారస్వామి, సంతోష్, శ్రీదేవి, జ్యోతి, సరిత, చంద్రమ్మ, పద్మ, రాధిక, మౌనిక, దివ్య, అవని, ప్రియాంక, అద్వితీయ, ఆశ్రిత, నక్షత్ర, ఆరాధ్య, అక్షర, మోక్ష, రావణ్, తదితరులు కృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్నారు.











