+91 99635 77856

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి..

Kudikala Sai Editor
maaksharamnews.in

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి..

హుజురాబాద్ /ఆగస్టు 16 (మా అక్షరం):పట్టణానికి చెందిన పంజాల కృష్ణ (34) శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... మూడు సంవత్సరాల క్రితం పోచమ్మవాడకు చెందిన వనం హరీష్‌కు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చిన కృష్ణ, ఇటీవల ఆ డబ్బులు అడిగాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. హరీష్ తీవ్రంగా తిట్టడంతో మనస్తాపానికి గురైన కృష్ణ ఆగస్టు 3న హుజురాబాద్ హై స్కూల్‌ మైదానంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు సేవించాడు.తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జమ్మికుంట మమత హాస్పిటల్‌, హనుమకొండ ఆదిత్య హాస్పిటల్‌, చివరగా హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మరణించాడు.ఈ ఘటనపై మృతుడి భార్య పంజాల తిరుమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనం హరీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ. కరుణాకర్ తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్ /ఆగస్టు 16 (మా అక్షరం):పట్టణానికి చెందిన పంజాల కృష్ణ (34) శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… మూడు సంవత్సరాల క్రితం పోచమ్మవాడకు చెందిన వనం హరీష్‌కు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చిన కృష్ణ, ఇటీవల ఆ డబ్బులు అడిగాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. హరీష్ తీవ్రంగా తిట్టడంతో మనస్తాపానికి గురైన కృష్ణ ఆగస్టు 3న హుజురాబాద్ హై స్కూల్‌ మైదానంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు సేవించాడు.తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జమ్మికుంట మమత హాస్పిటల్‌, హనుమకొండ ఆదిత్య హాస్పిటల్‌, చివరగా హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మరణించాడు.ఈ ఘటనపై మృతుడి భార్య పంజాల తిరుమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనం హరీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ. కరుణాకర్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !