+91 99635 77856

వరంగల్‌లో ‘ఆపరేషన్ కగార్ కు’ వ్యతిరేక సభను విజయవంతం చేయండి…

Kudikala Sai Editor
maaksharamnews.in

వరంగల్‌లో ‘ఆపరేషన్ కగార్ కు’ వ్యతిరేక సభను విజయవంతం చేయండి…

వరంగల్‌లో 'ఆపరేషన్ కగార్ కు' వ్యతిరేక సభను విజయవంతం చేయండి...

హుజురాబాద్ /ఆగస్టు 19 (మా అక్షరం):ఈనెల 24న వరంగల్ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించే ఆపరేషన్ కగార్ కు వ్యతిరేక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కరపత్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఈ సభ ద్వారా 'ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.ఆదివాసీల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.​ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలుతున్నట్లు తెలిపారు. 1/70 చట్టాన్ని అమలు చేయాలని,అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పెసా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశ సంపద అందరిదని, కేవలం కార్పొరేట్లదే కాదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు ,సొల్లు బాబు, ఆర్టీసీ నాయకులు మార్త రవీందర్, ఠాగూర్ సింగ్, ప్రభాకర్, న్యాయవాదులు తాళ్లపల్లి కుమారస్వామి, బండి రమేష్, భారత్ బచావో నాయకులు సత్తిరెడ్డి, సదానందం, మహేందర్ రెడ్డి, అలాగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు అరల్లి మల్ల గౌడ్, అయిందాల అంజన్న, గొల్లూరి ప్రవీణ్ కుమార్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.​ఈ సభకు ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, రైతులు, మహిళా, దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

వరంగల్‌లో ‘ఆపరేషన్ కగార్ కు’ వ్యతిరేక సభను విజయవంతం చేయండి…

హుజురాబాద్ /ఆగస్టు 19 (మా అక్షరం):ఈనెల 24న వరంగల్ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించే ఆపరేషన్ కగార్ కు వ్యతిరేక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కరపత్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… ఈ సభ ద్వారా ‘ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.ఆదివాసీల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.​ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలుతున్నట్లు తెలిపారు. 1/70 చట్టాన్ని అమలు చేయాలని,అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పెసా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశ సంపద అందరిదని, కేవలం కార్పొరేట్లదే కాదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు ,సొల్లు బాబు, ఆర్టీసీ నాయకులు మార్త రవీందర్, ఠాగూర్ సింగ్, ప్రభాకర్, న్యాయవాదులు తాళ్లపల్లి కుమారస్వామి, బండి రమేష్, భారత్ బచావో నాయకులు సత్తిరెడ్డి, సదానందం, మహేందర్ రెడ్డి, అలాగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు అరల్లి మల్ల గౌడ్, అయిందాల అంజన్న, గొల్లూరి ప్రవీణ్ కుమార్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.​ఈ సభకు ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, రైతులు, మహిళా, దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !