+91 99635 77856

పచ్చదనం పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

Kudikala Sai Editor
maaksharamnews.in

పచ్చదనం పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

-పచ్చదనం పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత...
-జర్నలిస్టు కాలనీలో హరితహారం...
-మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య...

హుజురాబాద్/ ఆగస్టు 19(మా అక్షరం): మొక్కలను పెంచడం వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తద్వారా పచ్చదనం పెరుగుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని కెసి క్యాంపులో గల జర్నలిస్టు కాలనీలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీలో 100 మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ... మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం మంచిదని అన్నారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణం సమతుల్యత బాగుంటుందని అన్నారు. స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు మాట్లాడుతూ.... పర్యావరణాన్ని కాపాడడానికి మున్సిపల్ చేస్తున్న అన్ని రకాల కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పచ్చదనం పెరగడంలో మా వంతు పాత్ర నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి ప్రెస్ క్లబ్ సెక్రటరీ కామని రవీందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ప్రెస్ క్లబ్ సభ్యులు పలువురు విలేకరులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-పచ్చదనం పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత…
-జర్నలిస్టు కాలనీలో హరితహారం…
-మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య…

హుజురాబాద్/ ఆగస్టు 19(మా అక్షరం): మొక్కలను పెంచడం వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తద్వారా పచ్చదనం పెరుగుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని కెసి క్యాంపులో గల జర్నలిస్టు కాలనీలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీలో 100 మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ… మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం మంచిదని అన్నారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణం సమతుల్యత బాగుంటుందని అన్నారు. స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు మాట్లాడుతూ…. పర్యావరణాన్ని కాపాడడానికి మున్సిపల్ చేస్తున్న అన్ని రకాల కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పచ్చదనం పెరగడంలో మా వంతు పాత్ర నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి ప్రెస్ క్లబ్ సెక్రటరీ కామని రవీందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ప్రెస్ క్లబ్ సభ్యులు పలువురు విలేకరులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !