+91 99635 77856

హుజురాబాద్‌లో గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కమిటీ ఎన్నిక

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కమిటీ ఎన్నిక

-హుజురాబాద్‌లో గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కమిటీ ఎన్నిక...
హుజురాబాద్‌/ సెప్టెంబర్ 02 (మా అక్షరం): గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కార్యనిర్వాహక కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా గంధే శ్రీనివాస్‌, అధ్యక్షుడిగా బుర్ర నటరాజ్‌, ఉపాధ్యక్షులుగా కె.డి. రాజు, ములుగు పూర్ణచందర్‌, నల్లగొని రాకేష్‌ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురేష్‌, కోశాధికారిగా రావుల రాహుల్‌ బాధ్యతలు స్వీకరించారు. సహాయ కార్యదర్శులుగా కొమురవెల్లి సంతోష్‌, సదానందం, అయిత సందీప్‌, కొండ్ర మహేష్‌ కొనసాగనున్నారు.నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... ప్రతి సంవత్సరం పట్టణంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటయ్యే మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలక, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేస్తూ నిమజ్జన ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.నిమజ్జనం రోజున అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ప్రత్యేక ఆహ్వాన వేదికను ఏర్పాటు చేసి నగర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తామని, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా గణపతి రథాలు, మండప నిర్వాహకులను సత్కరించడం పరంపరగా కొనసాగుతుందని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్‌లో గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కమిటీ ఎన్నిక…
హుజురాబాద్‌/ సెప్టెంబర్ 02 (మా అక్షరం): గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కార్యనిర్వాహక కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా గంధే శ్రీనివాస్‌, అధ్యక్షుడిగా బుర్ర నటరాజ్‌, ఉపాధ్యక్షులుగా కె.డి. రాజు, ములుగు పూర్ణచందర్‌, నల్లగొని రాకేష్‌ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురేష్‌, కోశాధికారిగా రావుల రాహుల్‌ బాధ్యతలు స్వీకరించారు. సహాయ కార్యదర్శులుగా కొమురవెల్లి సంతోష్‌, సదానందం, అయిత సందీప్‌, కొండ్ర మహేష్‌ కొనసాగనున్నారు.నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరం పట్టణంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటయ్యే మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలక, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేస్తూ నిమజ్జన ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.నిమజ్జనం రోజున అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ప్రత్యేక ఆహ్వాన వేదికను ఏర్పాటు చేసి నగర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తామని, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా గణపతి రథాలు, మండప నిర్వాహకులను సత్కరించడం పరంపరగా కొనసాగుతుందని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !