+91 99635 77856

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

Kudikala Sai Editor
maaksharamnews.in

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

 -బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో..
-ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..
హుజురాబాద్‌ /సెప్టెంబర్ 02(మా అక్షరం): కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు సీఎం డౌన్‌డౌన్‌ కేసీఆర్‌కిఅడ్డెవ్వడు అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...

కేసీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని, కాంగ్రెస్‌ పార్టీ ఘోష్ కమిషన్ల పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిని కాంగ్రెస్‌ సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా, రైతు భరోసా, బోనస్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

 -బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో..
-ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..
హుజురాబాద్‌ /సెప్టెంబర్ 02(మా అక్షరం): కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు సీఎం డౌన్‌డౌన్‌ కేసీఆర్‌కిఅడ్డెవ్వడు అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…

కేసీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని, కాంగ్రెస్‌ పార్టీ ఘోష్ కమిషన్ల పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిని కాంగ్రెస్‌ సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా, రైతు భరోసా, బోనస్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !