+91 99635 77856

బోర్నపల్లిలో వైఎస్సార్‌ వర్థంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

బోర్నపల్లిలో వైఎస్సార్‌ వర్థంతి వేడుకలు

హుజురాబాద్‌/సెప్టెంబర్‌ 02(మా అక్షరం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్‌. రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి వేడుకలను మంగళవారం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు వైఎస్సార్ లాంటి మహానేతను కోల్పోవడం దురదృష్టకరం.

ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి గడప లబ్ధి పొందింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను సాధించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక మంది ప్రజలు ప్రాణాలను కాపాడుకున్నారు అని గుర్తుచేశారు.అలాగే రాజశేఖర్ రెడ్డి తరహాలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను గడపగడపకు అందిస్తోంది. రాబోయే 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరనుందిఅని నేతలు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సందమల్ల నరేష్, దుబాసి బాబు, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల బాబు, కె.ఆర్‌. బిక్షపతి, జంగ అనిల్, రవి యాదవ్, ముక్క రవితేజ, గద్దల కార్తికేయ, వరుణ్, తిరుపతి, సాయి, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !