+91 99635 77856

గణపయ్య సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

Kudikala Sai Editor
maaksharamnews.in

గణపయ్య సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

-ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్వో, పట్టణ సీఐ...
హుజురాబాద్/ సెప్టెంబర్ 03 (మా అక్షరం): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కాలనీ లోని గణపతి మండపం వద్ద బుధవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్, ఎమ్మార్వో కనకయ్యలు ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు స్వయంగా వారే వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ.... నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో విజ్ఞేశ్వరుని పూజించాలని అన్నారు. హుజరాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞేశ్వరునీ ఆశీస్సులతో సకల లాభాలు కలగాలని కోరుకున్నారు. నిమజ్జన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. అలాగే యువత నిమజ్జనం సమయంలో మత్తు పానీయాలు సేవించకుండా నిష్టగా గణపతి నిమర్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు జున్నోజు సంధ్య- సందీప్, తేజ -సంపత్, అనుపమ - శ్రీధర్లు సంయుక్తంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు యూనస్ అహ్మద్ అలీ, రాధాకృష్ణ, విగ్రహదాత కొలిపాక నిర్మల, శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు పిన్ని రెడ్డి సుభాషిని-సదాశివ రెడ్డి, జున్నోజు భాస్కర్ -శ్యామల, వడ్లూరి ధనలక్ష్మి- సుదర్శన్, తాటిపాముల స్వరూప-దేవేందర్, శరణ్య, జోన్నోజు లవన్, తిప్పర్తి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్వో, పట్టణ సీఐ…
హుజురాబాద్/ సెప్టెంబర్ 03 (మా అక్షరం): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కాలనీ లోని గణపతి మండపం వద్ద బుధవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్, ఎమ్మార్వో కనకయ్యలు ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు స్వయంగా వారే వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ…. నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో విజ్ఞేశ్వరుని పూజించాలని అన్నారు. హుజరాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞేశ్వరునీ ఆశీస్సులతో సకల లాభాలు కలగాలని కోరుకున్నారు. నిమజ్జన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. అలాగే యువత నిమజ్జనం సమయంలో మత్తు పానీయాలు సేవించకుండా నిష్టగా గణపతి నిమర్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు జున్నోజు సంధ్య- సందీప్, తేజ -సంపత్, అనుపమ – శ్రీధర్లు సంయుక్తంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు యూనస్ అహ్మద్ అలీ, రాధాకృష్ణ, విగ్రహదాత కొలిపాక నిర్మల, శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు పిన్ని రెడ్డి సుభాషిని-సదాశివ రెడ్డి, జున్నోజు భాస్కర్ -శ్యామల, వడ్లూరి ధనలక్ష్మి- సుదర్శన్, తాటిపాముల స్వరూప-దేవేందర్, శరణ్య, జోన్నోజు లవన్, తిప్పర్తి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !