+91 99635 77856

హుజురాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటన

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటన

-వర్షం నీళ్లతో ముంచెత్తిన కాలనీల్లో వివరాల సేకరణ..
-ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకోవాలని డిమాండ్..
హుజురాబాద్/ సెప్టెంబర్ 12 (మా అక్షరం): పట్టణం లో గురువారం రాత్రి కురిసిన వర్షాల పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, గుడిగ జంగాల కాలనీ, మామిండ్లవాడ, గాంధీ నగర్ లలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజలతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అలాగే గుల్ల చెరువు వద్దకు వెళ్లి నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాత్రి కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదని ముందస్తుగానే మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశామని భారీగా ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు సహాయక చర్యలు చేపట్టాల చర్యలు తీసుకున్నమని అన్నారు. ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని, తాను అందుబాటులోనే ఉంటానని అన్నారు. తిరిగి వర్షం పడితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులను సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షంతో తడిసిన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి సమాచారం అందించామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, కిషన్, కోండ్ర నరేష్, ఇమ్రాన్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ సుధాకర్ రెడ్డి, టి ఓ నరేష్, టి పి ఓ అశ్విని,సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వినయ్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

-వర్షం నీళ్లతో ముంచెత్తిన కాలనీల్లో వివరాల సేకరణ..
-ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకోవాలని డిమాండ్..
హుజురాబాద్/ సెప్టెంబర్ 12 (మా అక్షరం): పట్టణం లో గురువారం రాత్రి కురిసిన వర్షాల పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, గుడిగ జంగాల కాలనీ, మామిండ్లవాడ, గాంధీ నగర్ లలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజలతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అలాగే గుల్ల చెరువు వద్దకు వెళ్లి నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాత్రి కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదని ముందస్తుగానే మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశామని భారీగా ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు సహాయక చర్యలు చేపట్టాల చర్యలు తీసుకున్నమని అన్నారు. ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని, తాను అందుబాటులోనే ఉంటానని అన్నారు. తిరిగి వర్షం పడితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులను సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షంతో తడిసిన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి సమాచారం అందించామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, కిషన్, కోండ్ర నరేష్, ఇమ్రాన్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ సుధాకర్ రెడ్డి, టి ఓ నరేష్, టి పి ఓ అశ్విని,సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వినయ్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !