+91 99635 77856

కృష్ణా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

కృష్ణా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

-కృష్ణా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి...
-సామాజిక కార్యకర్త గాజంగి వీరన్న...
జమ్మికుంట/ సెప్టెంబర్ 16(మా అక్షరం): జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణా కాలనీ ( 27వ వార్డ్ ) లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కారించాలని కోరుతూ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు మంగళవారం సామాజిక కార్యకర్త,కృష్ణా కాలనీ నివాసి గాజంగి వీరన్న వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్మికుంటలోని కృష్ణా కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని,కాలనీ వాసులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.కనకయ్య మేస్త్రి ఇంటి ముందర ఉండే డ్రైనేజీ మీదగల కల్వర్టు డ్యామేజ్ అయిందని దీంతో మురుగు నీరు రోడ్డు పైకి చేరుతుండటంతో కాలనీ వాసులకు సమస్యగా మారిందన్నారు.వర్షాలు పడుతుండటంతో విషజ్వరాలు ప్రబలే అసౌకర్యం లేకపోలేదని తెలిపారు.కాలనీలో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొని కిందపడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు.రోడ్డుకు ఓకే వేపు డ్రైనేజీ ఉండటంతోనే సమస్య తలెత్తుతుందని,కనకయ్య మేస్త్రి ఇంటి నుండి రెండు వైపులా కాలనీ లో కొత్త డ్రైనేజీ లను నిర్మించాలని,అలాగే కాలనీలో పిచ్చిమొక్కలను తొలగించాలని కోరారు.2021 సంవత్సరంలో పదవ నెలలో మిషన్ భగీరథ నీళ్ళను ఇవ్వడం జరిగిందని,కానీ నల్ల బిల్లు మాత్రం 2019 సంవత్సరం నుండి కట్టాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇట్టి సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చందనాల జయ రాములు,కురిమిండ్ల కనకయ్య మేస్త్రి,మూల హరీష్,కురిమిండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-కృష్ణా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి…
-సామాజిక కార్యకర్త గాజంగి వీరన్న…
జమ్మికుంట/ సెప్టెంబర్ 16(మా అక్షరం): జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణా కాలనీ ( 27వ వార్డ్ ) లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కారించాలని కోరుతూ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు మంగళవారం సామాజిక కార్యకర్త,కృష్ణా కాలనీ నివాసి గాజంగి వీరన్న వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జమ్మికుంటలోని కృష్ణా కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని,కాలనీ వాసులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.కనకయ్య మేస్త్రి ఇంటి ముందర ఉండే డ్రైనేజీ మీదగల కల్వర్టు డ్యామేజ్ అయిందని దీంతో మురుగు నీరు రోడ్డు పైకి చేరుతుండటంతో కాలనీ వాసులకు సమస్యగా మారిందన్నారు.వర్షాలు పడుతుండటంతో విషజ్వరాలు ప్రబలే అసౌకర్యం లేకపోలేదని తెలిపారు.కాలనీలో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొని కిందపడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు.రోడ్డుకు ఓకే వేపు డ్రైనేజీ ఉండటంతోనే సమస్య తలెత్తుతుందని,కనకయ్య మేస్త్రి ఇంటి నుండి రెండు వైపులా కాలనీ లో కొత్త డ్రైనేజీ లను నిర్మించాలని,అలాగే కాలనీలో పిచ్చిమొక్కలను తొలగించాలని కోరారు.2021 సంవత్సరంలో పదవ నెలలో మిషన్ భగీరథ నీళ్ళను ఇవ్వడం జరిగిందని,కానీ నల్ల బిల్లు మాత్రం 2019 సంవత్సరం నుండి కట్టాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇట్టి సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చందనాల జయ రాములు,కురిమిండ్ల కనకయ్య మేస్త్రి,మూల హరీష్,కురిమిండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !