+91 99635 77856

యూరియా విషయంలో రైతులను తప్పుదోవ పట్టించొద్దు

-యూరియా విషయంలో రైతులను తప్పుదోవ పట్టించొద్దు…
– యూరియా విషయంలో ఈటెల వ్యాఖ్యలు సరికాదు…
– యూరియా కొరత పాపం కేంద్రానిదే…
– రాజకీయాలకంటే రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం…

హుజురాబాద్/ సెప్టెంబర్16 (మా అక్షరం):యూరియా విషయంలో బీఆర్ఎస్,బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని,యూరియా పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2 పట్టణాలు,5 మండలాల చెందిన 54,31,500/- విలువ చేసే 147 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ… దేశంలో రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వం అని ఆది బీజేపీ ఎంపీలే చెప్పారని దానికి విరుద్ధంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని,కేవలం తెలంగాణనే కాకుండా పక్కన ఉన్న బీజేపీ,ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా యూరియా కొరత ఉందని దానికి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రణాళికబద్దంగా యూరియా సరఫరా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు కూడా పంపామని కేంద్రం నుండి రావాల్సిన యూరియా ఇవ్వలేదని అన్నారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూరియా విషయంలో పిట్ట కథలు చెప్తున్నారని,వారి మాటలు చూస్తే బీజేపి,బిఆర్ఎస్ ములాఖాత్ బయటపడుతుందని, కేటీఆర్ వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందని బహిరంగంగా ఒప్పుకున్నారని,కాళేశ్వరం విషయంలో చిన్న స్థాయి ఉద్యోగి దగ్గరే వందల కోట్లు దొరికితే ప్రాజెక్ట్ రూపకర్త అని చెప్పే కేసీఆర్,కేటీఆర్ దగ్గర ఇంకా ఎన్ని కోట్లు దొరుకుతాయి అని ప్రశ్నించారు.మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని దానికి అనుగుణంగా రైతులకు ఇబ్బందులు కలగుకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నారని మళ్ళీ యూరియా కోసం అడిగారని అన్నారు.రైతుల విషయంలో బిఆర్ఎస్,బీజేపీ చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని రాజకీయాల కంటే రైతుల సంక్షేమం ప్రయోజనమే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !