-తల్లిని పోషించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు..
హుజురాబాద్/ సెప్టెంబర్ 17( మా అక్షరం): మండలంలోని కనుకులగిద్ద గ్రామానికి చెందిన ములుగు రాజమ్మను ఆమె ముగ్గురు కుమారులు పోషించడం లేదంటూ చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం కనుకులగిద్ద గ్రామంలో బుధవారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ …తన కుమారులు పోషణ చేయడం లేదని తెలిపారు. ఇంతకుముందు ఆర్డీఓ హుజురాబాద్ ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించినప్పటికీ అమలు చేయలేదని వివరించారు.విచారణలో కుమారులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిని పోషించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ముగ్గురు కుమారులు ఇకపై తల్లి పోషణ బాధ్యతలు తీసుకుంటామని, కనీస అవసరాలను సమకూర్చుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్.శేఖర్, డివిసి కౌన్సిలర్ పద్మావతి, ఎఫ్‌ఆర్‌ఓ రఫీ, హెడ్ కానిస్టేబుల్ మధు, మల్లయ్య, మర్రి శ్రీనివాస్, పులి కళ్యాణి, హోం గార్డ్ ప్రశాంత్, జిపిఓ తదితరులు పాల్గొన్నారు.











