+91 99635 77856

వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

హుజురాబాద్/ సెప్టెంబర్ 20 (మా అక్షరం):పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రకాల పూలతో బతుకమ్మను అలంకరించి, పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులు, బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ వంటి సాంప్రదాయ పండుగలు దోహదపడతాయని తెలిపారు. చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో మా కళాశాల ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రమశిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సమాజ సేవలోనూ ముందుండాలని సూచించారు. సమాజ సేవలో ఎన్ఎస్ఎస్ ద్వారా అనేక సేవలందించిన ఏకైక డిగ్రీ కళాశాలగా వాగ్దేవి కళాశాల ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్, అధ్యాపకులు భద్రయ్య, రమేష్, సంపత్, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !