-వికలాంగుల పెన్షన్లు వెంటనే పెంచాలని డిమాండ్…
– ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముట్టడి…
హుజురాబాద్/ సెప్టెంబర్ 20 (మా అక్షరం):
వికలాంగుల పెన్షన్ల పెంపు కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపేట గ్రామపంచాయతీని శనివారం ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ హాజరయ్యారు.జిల్లా ప్రధాన కార్యదర్శి దేవు నూరి రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ముట్టడిలో జనార్ధన్ మాట్లాడుతూ…“వికలాంగులు, వితంతువులు, వృద్ధుల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్తంగా ముట్టడులు చేపట్టడం అభినందనీయమని, ఎన్నికలకు ముందు పెన్షన్ పెంపు హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు పెన్షన్లు పెంచకపోవడం బాధాకరం. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి” అని డిమాండ్ చేశారు.అనంతరం గ్రామ కార్యదర్శి గిన్నారపు లావణ్యకు మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజానాయకులు, వికలాంగులు వెంకేపల్లి మధుసూదన్, గాజే లక్ష్మీప్రియా, చందుపట్ల విట్టల్, మంతెన భాస్కర్, సంధి మల్లారెడ్డి, ఏఎంసీ మెంబర్ లోకిని రాజకుమార్, బొంగోని శ్రావణ్, ప్రజానాయకులు గాజుల హరీష్, చింత శ్రీనివాస్, కంకణాల కుమార్, ఓల్లాల నరేష్, కంకణాల కొమురయ్య, చింత శ్యామ్, బొల్లె వేని కనకమ్మ, బొల్లె వేని మీనమ్మ, గాజ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











